భారతదేశం, ఫిబ్రవరి 8 -- Meta mass layoffs: మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా మరోసారి మాస్ లే ఆఫ్స్ చేపట్టనుంది. వచ్చే వారం నుంచి సరైన పని తీరు చూపని ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. సోమవారం ఉదయం నుంచి ఆయా ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపించనుంది.

టెక్నాలజీ దిగ్గజం మెటా తన సంస్థలోని మొత్తం 3,600 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా సహా చాలా దేశాల్లో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు ఈ నోటీసులు వెళ్లనున్నాయి. మరోవైపు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ల నియామకాన్ని వేగవంతం చేయనున్నట్లు మెటా అంతర్గత మెమోలో సిబ్బందికి తెలిపింది.

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల్లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా ఈ లే ఆఫ్ ల నుంచి మినహాయింపు ఉంటుందని మెటా తెలిపింద...