భారతదేశం, జనవరి 14 -- సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థకు చెందిన 'రియాలిటీ ల్యాబ్స్' (Reality Labs) విభాగంలో భారీగా కోత విధించింది. సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2026 ఏడాదిలో మెటా చేపట్టిన మొదటి అతిపెద్ద లేఆఫ్ ఇదే కావడం గమనార్హం.

గత కొన్నేళ్లుగా మెటావర్స్ (Metaverse) కల సాకారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మార్క్ జుకర్‌బర్గ్, ఇప్పుడు తన రూటు మార్చారు. కంపెనీ తన పూర్తి ఫోకస్‌ను మెటావర్స్ నుంచి 'ఏఐ డివైజ్‌ల' (AI devices) వైపు మళ్ళిస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగానే రియాలిటీ ల్యాబ్స్‌లో ఉద్యోగాల కోత అనివార్యమైందని తెలుస్తోంది.

మొత్తం 15,000 మంది ఉద్యోగులున్న ఈ విభాగంలో, తాజా నిర్ణయంతో సుమారు 10 శాతం మంది ఉపాధి కోల్పోయార...