భారతదేశం, డిసెంబర్ 13 -- స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నాడు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో పాల్గొంటాడు.ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. క్రీడా వినోదంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.

ఈవెంట్ నిర్వాహకుడు అనుత్తమ్ రెడ్డి.. మెస్సీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. "లియోనెల్ మెస్సీ రాత్రి 7:00-7.30 గంటల మధ్యలో స్టేడియంలో ఉంటాడని భావిస్తున్నాం. సాయంత్రం 5.30 గంటల నుంచే సంగీత కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అందరికీ ఎంటర్ టైన్ మెంట్ పుష్కలంగా ఉంటుంది. మెస్సీ మాతో కలిసి సుమారు 1 గంట పాటు గ్రౌండ్ లో ఉంటాడు. చాలా ఈవెంట్స్ ఉంటాయి. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్లుగా ఆయన పిల్లలతో కలిసి మమేకమవుతారు" అని తెలిపారు.

సింగరేణి RR జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా.. అపర్ణ మెస్స...