Hyderabad, ఫిబ్రవరి 19 -- మెనస్ట్రువల్ కప్స్‌ అనేది ఆధునికతరంలో మొదలైన అలవాటు. ఒకప్పుడు పీరియడ్స్ సమయంలో మహిళలు కేవలం సాధారణ వస్త్రాన్ని వినియోగించేవారు. తర్వాత శానిటరీ వినియోగం మొదలైంది. ఇప్పుడు టాంఫోన్లు, మెనస్ట్రువల్ కప్పులు వంటివి వినియోగంలోకి వచ్చాయి.

ఈ మెనస్ట్రువల్ కప్పులు సౌకర్యవంతంగా చిన్న గంట ఆకారంలో ఉంటాయి. వీటిని యోనిలోకి చొప్పించుకోవాలి. అది మొత్తం పీరియడ్స్ లోని రక్తాన్ని సేకరిస్తుంది. తర్వాత దానిని తీసి శుభ్రపరుచుకోవాలి. దీన్ని తిరిగి మళ్ళీ వినియోగించుకోవచ్చు. కాబట్టి శానిటరీ ప్యాడ్ లాగా దీన్ని పదే పదే కొనాల్సిన అవసరం లేదు. కేవలం పరిశుభ్రంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

కొంతమందిలో ఈ మెనస్ట్రువల్ కప్పు వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం ఉంది. ముఖ్యంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. ఈ కప్పు మూత్ర...