Hyderabad, ఏప్రిల్ 4 -- మగవారికి ధైర్యం ఎక్కువనీ, అంత ఈజీగా దేనికీ భయపడరని అంతా అనుకుంటారు. వారికి సిగ్గు, బిడియం వంటివి సిల్లీ ఫీలింగ్స్ ఉండవని ఫీలవుతారు. కానీ వాస్తవం ఏంటంటే.. వారు కూడా చాలా సందర్భాల్లో భయపడతారట, కంగారు, సిగ్గు, బిడియం వంటి ఫీలింగ్స్ వారికి కూడా ఎక్కువగానే ఉంటాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బయటికి గంభీరంగా, ధైర్యంగా, ధీమాగా కనిపించే పురుషులు కొన్నిసార్లు ఆడవారి కన్నా ఎక్కువగా కంగారు పడతారట. సిగ్గుతో, భయంతో వారికి చెమటలు కూడా పట్టేస్తాయట. కానీ ఈ ఫీలింగ్స్‌ని వారు బయటికి చూపించరట.

నిజమేనా అని అనుమానంగా ఉందా? అవును కొందరు మానసిక నిపుణులు మగవారిలోని కంగారు, భయం, సిగ్గు వంటి విషయాలపై కొన్ని రకాల స్టడీలు చేశారు. వాటి ప్రకారం.. పురుషులు కూడా చాలా సందర్భాల్లో ఆడవారి కన్నా ఎక్కువగా కంగారు పడుతుంటారట, లోలోపల సిగ్గుపడుతూ బయటికి ...