భారతదేశం, మార్చి 7 -- వుమెన్స్ డే సెలబ్రేషన్స్ ముందే మొదలయ్యాయి. మహిళల దినోత్సవసం సందర్భంగా మెగా కుటుంబం నుంచి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతోంది. ఆదివారం (మార్చి 8) వుమెన్స్ డేను పురస్కరించుకుని 'మెగా వుమెన్' పేరుతో తల్లి, సిస్టర్స్, నాగబాబు తో కలిసి చిరంజీవి స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో నేడు (మార్చి 7) రిలీజైంది. ఈ ప్రోమోలో చిరంజీవి పంచ్ లు నవ్వులు పూయిస్తున్నాయి.

తల్లి అంజనాదేవి, సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి, తమ్ముడు నాగబాబుతో కలిసి చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమ్మతో ఉన్న అనుబంధం గురించి వీళ్లు పంచుకున్నారు. అన్నయ్య వాళ్లు దూరంగా ఉండటంతో అమ్మకు అన్ని పనులు తానే చేసేదాన్ని అని విజయదుర్గ అన్నారు. ఇద్దరి బిడ్డలతో ధైర్యంగా ఉండాలి, ఎవరిపై ఆధారపడొద్దని అమ్మ ధైర్యమిచ్చేదని ఆమె అన్నారు.

తాను డిప్రెషన్ లోకి...