భారతదేశం, ఏప్రిల్ 1 -- డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టారు. విక్టరీ వెంకటేశ్ నటించిన ఆ చిత్రం సంక్రాంతి పండగకు వచ్చి రూ.300కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది. డైరెక్టర్ అనిల్ క్రియేటివిటీతో చేసిన ప్రమోషన్లు ఆ మూవీ అంత భారీ సక్సెస్ సాధించడానికి ఓ కారణం అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ (మెగా157) చేస్తున్నారు అనిల్. ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్‍గా జరిగాయి. అయితే, చిరూతో ఈ సినిమాకు షూటింగ్ ముందే ప్రమోషన్లను అనిల్ మొదలెట్టేశారు. మూవీ టీమ్‍ను చిరంజీవికి పరిచయం చేస్తున్నట్టు ఓ ఎంటర్‌టైనింగ్ వీడియో వదిలారు. ఇది చాలా సరదాగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాల కటౌట్‍లతో ఓ లొకేషన్‍ను మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. కారులో చిరంజీవి దిగి రావటంతో ఈ వీడియో మొదలైంది....