భారతదేశం, డిసెంబర్ 5 -- మీషో లిమిటెడ్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) భారతీయ ప్రైమరీ మార్కెట్‌లో డిసెంబర్ 3, 2025న ప్రారంభమైంది. ఈ ఇష్యూ సబ్​స్క్రిప్షన్​నేటితో, అంటే డిసెంబర్ 5న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మీషో ఐపీఓ జీఎంపీతో పాటు అసలు దీనికి అప్లై చేయాలా? వద్దా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఈ మీషో ఐపీఓ ఫ్రెష్​ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ కలయికగా వచ్చింది.

ఫండ్స్​ టార్గెట్​: కంపెనీ మొత్తం రూ. 5,421.20 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రెష్​ ఇష్యూ: ఇందులో రూ. 4,250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు.

ఓఎఫ్‌ఎస్: మిగిలిన రూ. 1,171.20 కోట్లు ఓఎఫ్‌ఎస్ మార్గం కోసం రిజర్వ్ చేయడం జరిగింది.

మీషో ఐపీఓ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ అవుతుంది.

మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, మీషో లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్‌లో మంచి ప్రీమియ...