భారతదేశం, మార్చి 23 -- మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ సౌరభ్​ రాజ్​పుట్​కు సంబంధించిన​ మీరట్​ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. భర్తను హత్య చేసిన తర్వాత ముస్కాన్​ రస్తోగి, తన ప్రియుడు సాహిల్​ శుక్లాతో హిమాచల్​ ప్రదేశ్​కి వెళ్లి హోలీ వేడుకలు చేసుకున్న విషయం అందరిని షాక్​కి గురిచేసింది. ఇక ఇప్పుడు నిందితులు రిమాండ్​లో ఉన్న జైలు నుంచి మరికొన్ని షాకింగ్​ విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు.. డ్రగ్స్​ కావాలని ఏకంగా పోలీసులనే అడిగినట్టు సమాచారం. డ్రగ్స్​ లేకపోతే భోజనం కూడా వద్దంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరు తీవ్రమైన డ్రగ్​ అడిక్షన్​ సమస్యతో బాధపడుతున్నట్టు ఇది స్పష్టం చేస్తోంది.

ఈ నెల 4న ముస్కాన్, ప్రియుడు సాహిల్​తో కలిసి, తన భర్త సౌరభ్​ను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచి సిమెంట్​తో నింపింది. ఆ తర్వాత ప్...