భారతదేశం, మార్చి 19 -- Meerut murder: ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హతమార్చారు. అతడిని కత్తితో పొడిచి చంపి, అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి సిమెంట్ తో డ్రమ్ములో సీల్ చేశారు. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 4న బ్రహ్మపురిలోని ఇంద్రా నగర్ ఫేజ్ 2 నుంచి సౌరభ్ రాజ్ పుత్ (29) కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య ముస్కాన్ (27), ఆమె స్నేహితుడు సాహిల్ (25)లను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు.. వారిని మరింత లోతుగా ప్రశ్నించారు. దాంతో, మార్చి 4న రాజ్ పుత్ ను కత్తితో పొడిచి చంపినట్లు వారిద్దరూ...