భారతదేశం, జనవరి 28 -- Meerpet Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్ పేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. వెంకట మాధవి హత్య కేసులో ఆధారాలు సేకరించడానికి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. భార్యను ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా? అని నివ్వెరపోయామన్నారు.

"ఈ నెల 18వ తేదీన తన కూతురు వెంకట మాధవి తప్పిపోయిందని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన పెద్ద కూతురు పుట్టా వెంకట మాధవి ఆమె భర్త గురుమూర్తి, ఇద్దరు పిల్లలతో జిల్లెలగూడ గ్రామంలో నివసిస్తుంది. ఈ నెల 16న వెంకట మాధవి, ఆమె భర్త గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మనస్తాప...