భారతదేశం, ఫిబ్రవరి 10 -- హైదరాబాద్‌ మీర్‌పేటలో మహిళ హత్య ఘటన సంచలనం సృష్టించింది. భార్యను మర్డర్ చేసి.. డెడ్ బాడీని ముక్కలుగా చేసి మాయం చేశాడు భర్త. ఈ కేసులో నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్‌లను నిందితులుగా చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు.

ప్రధాన నిందితుడు గురుమూర్తిపై హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా.. మిగిలిన ముగ్గురిపై బీఎన్‌ఎస్‌లోని 85 సెక్షన్‌‌ను నమోదు చేశారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏపీలోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి.. భార్య, ఇద్దరు పిల్లలతో రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జిల్లెలగూడలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గతనెల 16న హత్య జరిగింది.

గురుమూర్తి, అతని భార...