భారతదేశం, జనవరి 28 -- మీర్‌పేట హత్య కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడి ఇంటి వద్ద గురుమూర్తితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. ప్రస్తుతం మీర్‌పేట పోలీసు స్టేషన్‌లోనే నిందితుడు ఉన్నాడు. గురుమూర్తిని మంగళవారం రాత్రి లోపు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

గురుమూర్తి, వెంకట మాధవి భార్యాభర్తలు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే.. కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తన భార్య వెంకట మాధవిని గురుమూర్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి.. కుక్కర్‌లో ఉడికించాడు. ఎలక్ట్రిక్ హీటర్ సాయంతో బకెట్‌లోనూ ఉడికించాడు. ఎముకలను కాల్చి బూడిద చేసి చెరువులో పడేశాడు.

ఇదంతా చేసి.. ఆ తర్వాత ఏమీ...