భారతదేశం, జనవరి 28 -- మీర్‌పేట్ మహిళ హత్య కేసు గురించి షాకింగ్ వివరాలు వెలువడుతూనే ఉన్నాయి. మాజీ సైనికుడు తన భార్యను నరికి, ఆమె శరీర భాగాలను బకెట్‌లో ఎలక్ట్రిక్ హీటర్‌తో ఉడికించాడు. ఆపై ఎముకలను పొడి చేసి.. హత్య నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే వాటిని నీటిలో పారేశాడు. ఈ మర్డర్ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుమూర్తికి ఇంకా ఎవరైనా సహకరించారనే అనే కోణంలో విచారణ జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక విషయం వెల్లడైంది.

జిల్లెలగూడలో నివాసం ఉంటున్న గురుమూర్తి.. జనవరి 15న సంక్రాంతి రోజున తన భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి వెళ్లడానికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అతని స్నేహితుడిని విచారణ కోసం పిలిపించినట్లు సమాచారం. అతనే ఈ విష...