భారతదేశం, జనవరి 22 -- Meerpet Murder : తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ లో ఈ దారుణం జరిగింది. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి...భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యాభర్తలు గురుమూర్తి, వెంకట మాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయని, తరచూ గొడవపడుతుండేవారని పోలీసులకు తెలిపింది. దీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు.

తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని మ...