భారతదేశం, జనవరి 27 -- Meerpet Murder: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్షణికావేశంలో జరిగిన హత్యను కప్పి పుచ్చేందుకు నిందితుడు ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాతో ప్రేరణ పొందినట్టు దర్యాప్తులో వెల్లడించాడు. శవాన్ని మాయం చేసే నేపథ్యంలో ఇటీవల ఓటీటీలో విడుదలైన సూక్ష్మదర్శిని సినిమాతో ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది.

హైదరబాద్‌ మీర్‌ పేట హత్య కేసులో రోజుకో కొత్త సంగతి బయటపడుతోంది. కుక్కర్‌ ఉడికించి భార్య శవాన్ని మాయం చేసినట్టు పోలీసులకు చెప్పిన గురుమూర్తి శవాన్ని మాయం చేయడానికి యాసిడ్లను వినియోగించినట్టు గుట్టు విప్పాడు. శవం మొత్తాన్ని కుక్కర్‌లో ఉడికించడం ఎలా సాధ్యమనే సందేహాలు వచ్చినా అసలు రహస్య విచారణలో వెలుగు చూసింది.

ఈ కేసుపై పోలీసులు విచారణలో పలు అంశాలు వెలుగు చూశాయి. నిందితుడు గురుమూర్...