Hyderabad, మార్చి 1 -- రిటైర్మెంట్ తీసుకున్న మీనాక్షి మేనన్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు. వయస్సు పైబడితే శరీరం బలహీనపడుతుంది. కానీ, అనుభవం, తెలివితేటలు కాదనే ఉద్దేశ్యంతో సీనియర్ సిటిజన్స్ కోసం ఒక యాప్ రూపొందించారు. GENS అనే యాప్ ద్వారా వయస్సు పైబడిన వారు కూడా ఏదైనా సాధించగలరని నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు. 65 ఏళ్ల ముంబైకి చెందిన మీనాక్షి ఆలోచన ఏంటో తెలుసుకుందామా..!

'సీనియర్ సిటిజన్' అంటే వయసులో ముందున్నా, వారి ఆలోచనలు, వారి దుస్తులు, జీవితం పట్ల ఉన్న ఆశయం, ఉత్సాహం ఏ యువతీయువకుడికీ తీసిపోవు. ఒకప్పుడు మన దేశంలో రిటైర్మెంట్ తర్వాత వ్యక్తి సామర్థ్యం తగ్గిపోతుందని, ఇంట్లోనే ఉండాలని భావించేవారు. కానీ ఇప్పుడు జీవితం అక్కడితో ముగిసిపోవాలని కోరుకోవడం లేదని చెబుతారు. వారికి ఇంకా చాలా కోరికలు, చేయాలనే తపనతో అవకాశాల కోసం వెతుకుతుంటారట....