భారతదేశం, మార్చి 2 -- Meenakshi Chaudhary : ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల విజయాలతో దూసుకుపోతున్న ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఫేక్ అని ఏపీ ఫ్యాక్ట్ చెక్ నిర్థారించింది. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్నారని తేల్చి చెప్పింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఏపీ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవిని నియమించారు. ఈ మేరకు సీఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకమైన వైష్ణవి, రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును...