HYderabad, ఏప్రిల్ 5 -- వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. శరీరం సున్నితంగా మారడంతో పాటు మనకు తెలియకుండానే కొన్ని వ్యాధులు మొదలైపోతాయి. ఈ మార్పులు పురుషులతో పాటు మహిళల్లోనూ సమానంగా కనిపించినా, మహిళల్లో కొన్ని వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందట. వాస్తవానికి, జీవసంబంధమైన తేడాలు, లింగ అసమానతలు మహిళల్లో అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, కౌమార బాలికలు, యువతులలో వారితో సమాన వయస్సున్న పురుషులతో పోలిస్తే HIV సంక్రమణ ప్రమాదం రెట్టింపుగా ఉందట. 10 మందిలో 1 మహిళకు 60 ఏళ్ళు నిండేలోపే కనీసం ఒకసారైనా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అదేవిధంగా, ప్రతి సంవత్సరం 20-40 శాతం మరణాలు రక్తహీనత కారణంగానే సంభవిస్తున్నాయి. అందుకే, వైద్యులు 30 నుండి 40 ఏళ్ళ వయస్సు గల మహిళల...