కరీంనగర్,తెలంగాణ, ఫిబ్రవరి 2 -- కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తీ సాహు ఆత్మహత్య కలకలం సృష్టించింది. మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆర్తీ సాహు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సాహు కూతురు ఆర్తీ సాహు ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ సెకండియర్ పల్మనాలోజి చదువుతోంది. జనవరి 30న హాస్టల్ రూమ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తమ కూతురు ఆత్మహత్యకు తోటి వైద్య విద్యార్థి ఆశిష్ కారణమని ఆర్తీ సాహు తండ్రీ రాజేంద్ర సాహు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.

రెండు మాసాల క్రితం ఆశిష్ చెంపమీద కొట్టాడని తమ కూతురు చెప్పిందని ఆర్తీ సాహు తండ్రీ రాజేంద్ర సాహు ఫిర్యాదులో పేర్కొన్నారు...