భారతదేశం, ఫిబ్రవరి 16 -- Medchal Murder : మేడ్చల్‌ లో దారుణం జరిగింది. మేడ్చల్ బస్‌ డిపో ముందు పట్టపగలే...ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు అతిదారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఘాతుకానికి పాల్పడ్డారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్‌గా తెలుస్తోంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నడిరోడ్డుపై కత్తుతో ఉమేశ్‌పై దాడి చేస్తుండగా జనం చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా ఈ దారుణాన్ని వీడియోలు తీసుకున్నారు. ఉమేశ్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు.

ఉమేశ్ ను హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మేడ్చల్ మర్డర్ కేసుల...