భారతదేశం, ఫిబ్రవరి 17 -- Medchal Murder: మేడ్చల్‌ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్య జరిగింది. తొడబుట్టిన అన్నను కుటుంబ వివాదాల నేపథ్యంలో సొంత తమ్ముళ్లు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ మార్గంలో వెళ్లే వారు ఎవరు హత్యను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొందరు వీడియోలు తీయడంతో అది వైరల్‌గా మారింది. మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నందుకు తమ్ముళ్లు చంపేసినట్టు పోలీసులు తెలిపారు.

మేడ్చర్‌ నేషనల్‌ హైవే 44పై ఆదివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అంతా చూస్తుండగానే కొందరు యువకులు వెంటాడి పొడిచి చంపారు. కింద పడిపోయిన వ్యక్తి ప్రాణాలు పోయే వరకు కత్తులతో పొడుస్తూనే ఉన్నారు. ఈ దారుణాన్ని ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

నిందితులను మృతుడి సొంత తమ్ముడు, చిన్నాన్న కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో నుంచి వెంట పడి, కత్తులతో పొడ...