భారతదేశం, ఏప్రిల్ 13 -- ములుగు జిల్లా మేడారం టెరిటోరియల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ రేంజ్‌ల పరిధి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో.. పులి సంచరిస్తోందని ఏటూరునాగారం రేంజ్‌ అధికారులు చెబుతున్నారు. మేడారం, మహదేవపూర్ సరిహద్దు అడవిలో పులి ఒక గేదెను చంపినట్లుగా ఆనవాళ్లు లభ్యమయ్యాయని అంటున్నారు. దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏటూరునాగారం ఎఫ్‌డీవో ఆదేశాల మేరకు.. పులి సంచారం, అడుగు జాడలు తెలుసుకునేందుకు.. తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట, కాల్వపల్లి, నార్లాపూర్, కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, ఏటూరునాగారం మండలం కొండాయి అడవుల్లో పర్యటించినట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావొద్దని సూచించారు.

ఏటూరునాగారం అడవులు.. పెద్ద సంఖ్యలో చిరుతపులులు, అడవి పందులు, దుప్పులు, కొండగొర్రెలు వంటి పులుల ఆహారానికి అ...