భారతదేశం, జనవరి 10 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే జాతర కోసం వచ్చే కోట్లాది మంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. మేడారంలో 3 హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనుంది.అంతేకాకుండా జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులను అందుబాటులో ఉంచనుంది.

మేడారం జాతరలో అందించే వైద్య సేవలపై ఉన్నతాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం సమీక్ష నిర్వహించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు.

ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున...