భారతదేశం, ఫిబ్రవరి 14 -- మేడారం జాతరలో వన దేవతలకు బెల్లం సమర్పించడం అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం. బెల్లం అనేది తీపి పదార్థం. ఇది సంతోషానికి, సమృద్ధికి చిహ్నంగా భావిస్తారు. అంతేకాదు.. బెల్లంను శక్తికి మూలంగా కూడా పరిగణిస్తారు. పూర్వం రోజుల్లో జాతరకు వచ్చే భక్తులు అడవుల గుండా నడిచి వచ్చేవారు. దారిలో వారికి శక్తిని అందించేది బెల్లమే. అందుకే బెల్లంను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయంగా మారింది.

మేడారం జాతరలో బెల్లంను బంగారంతో సమానంగా భావిస్తారు. ఇందుకు కారణం.. భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే సమయంలో అమ్మవార్లకు బెల్లంను సమర్పిస్తారు. దీనిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరితే.. అమ్మవార్లకు బెల్లం సమర్పిస్తామని మొక్కుకుంటారు. కోరికలు నెరవేరిన తర్వాత.. బెల్లంను సమర్పించి మొక్కును చెల్లిస్తారు. ఈ ఆచారం కాకతీయుల...