భారతదేశం, ఫిబ్రవరి 6 -- Medaram Jatara: ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుండగా.. బుధవారం మినీ మేడారం జాతరకు అంకురార్పణ జరిగింది. జాతర ప్రారంభానికి సరిగ్గా వారం రోజుల ముందు గుడి మెలిగె, మండ మెలిగె పండుగ నిర్వహిస్తుంటారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా బుధవారం సమ్మక్క, సారలమ్మ పూజారులు గుడి మెలిగె పండుగకు శ్రీకారం చుట్టారు.

మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్దబోయిన వంశస్థులు, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు గుడిమెలిగె పండుగ నిర్వహించారు. ఈ గుడిమెలిగే పండుగలో భాగంగా అత్యంత నియమ నిష్టలతో పూజారులు గుడిని నీటితో శుద్ధి చేశారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు డోలు వాయిద్యాలతో అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్టగడ్డిని తీసుకొని వచ్చారు.

గడ్డికి పసుపు, కుంకుమలతో పూజలు చేసిన అనం...