భారతదేశం, మార్చి 17 -- Medak Suicides: సిద్ధిపేట జిల్లాలో దంపతుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. దీంతో నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. జిల్లాలోని తొగుట మండలం ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కెమ్మసారం నాగరాజు (35), కు గుంట భూమి లేకపోవడంతో రెక్కల కష్టాన్ని నమ్ముకొని ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్య భాగ్య తో పాటు తమ పిల్లలు మీనాక్షి (9), మహేష్ (7), లక్కీ (5), శ్రవణ్ (4)లను పోషించుకునే వాడు.

సిద్దిపేట జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో చేతినిండా పనులు లేక పోవడం, పిల్లల ను సాకే పరిస్థితి లేకపోవడంతో, ఆదివారం రోజు మధ్యాహ్నం నాగరాజు భార్య భాగ్య (32) పురుగుల మందు సేవించగా సిద్దిపేట లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

భార్య మరణ వార్త జీర్ణించుకోలేక నాగరాజు సిద్దిపేట లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో గల...