భారతదేశం, మార్చి 4 -- Medak News : మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాలపురం గ్రామంలో, టేక్కల్ మండలం ఏల్లుపేట్ గ్రామంలో 3 రోజుల నుంచి దాణా, నీళ్లు అందక కోళ్లు మృత్యువాడపడుతున్నాయి. కోళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గి, కొక్కెర రోగం, ఇతర రోగాల వలన మృతి చెందాయని ప్రాథమికంగా నిర్దారించామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు మరణించడంతో, వాటి రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు.

పౌల్ట్రీ రైతులు చేతులకు గ్లౌజులు, మాస్కులు లేకుండా చనిపోయిన కోళ్లను తాకరాదని తెలిపారు. కోళ్ల ఫార్మ్ లో పనిచేసిన తర్వాత 20 నుంచి 30 సెకన్లు పాటు చేతులను సబ్బుతో గాని శానిటైజర్ తో గానీ శుభ్రపరచుకోవాలని సూచించారు. షెడ్ చుట్టూ సున్నం, బ్లీచింగ్ పౌడర్ తరచుగా చల్లాలన్నారు. షెడ్ లోపల శానిటైజర్ ఉపయోగించాలన్నాు. హఠాత్తు...