భారతదేశం, ఫిబ్రవరి 3 -- Medak Father: రోజు మాదిరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన తండ్రి కుమారుల్లో కొడుకు ప్రమాదవశాత్తూ వాగులో పడిపోయాడు. నీటి ఒరవడికి కొట్టుకుపోయాడు. ఇది చూసిన తండ్రి ప్రాణాలను లెక్క చేయకుండా నీటిలో దూకి కొడుకును కాపాడుకున్నాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

రోజువారీ పనుల్లో భాగంగా పంటలకు నీరు పెట్టేందుకు ఆదివారం తండ్రీకొడుకుల్లో కుమారుడు ఉదృతంగా ప్రవహిస్తున్న కూడవెల్లి వాగులో జారి పడిపోయాడు. వాగు నుంచి మోటారుతో నీటిని తోడుతుండగా ప్రమాదవశాత్తు కుమారుడు అందులో పడిపోయాడు. అక్కడే ఉన్న తండ్రి ప్రాణాలకు తెగించి నీళ్లల్లో కొట్టుకుపోతున్న కొడుకును రక్షించాడు.

మెదక్‌ జిల్లాలోని అక్బర్ పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్‌ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. 108 సిబ్బంది నర్సి...