భారతదేశం, ఫిబ్రవరి 21 -- Medak Dumping Yard: ప్యారానగర్‌ డంపింగ్‌ యార్డ్‌ విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచించాలని సీపీఎం డిమాండ్ చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేకే భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి గుమ్మడిదల, నల్లవల్లి, ప్యారానగర్‌ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ సందర్బంగా రాములు మాట్లాడుతూ ప్యారానగర్‌లో డంపింగ్‌ యార్డ్‌ను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నందున అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్‌ యార్డ్‌ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు.

గుమ్మడిదల ప్రాంతమంతా పచ్చటి పాడి పంటలతో కళకళలాడుతదని, నిత్యం కూరగాయలు, ఇతర పంటల...