భారతదేశం, ఫిబ్రవరి 11 -- Medak Dumping Yard: 0ప్యారానగర్ డంపింగ్‌ యార్డ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని గుమ్మడిదల రైతులు పోరుబాట పట్టారు. మండలంలోని, ప్యారానగర్ దగ్గరలో ఉన్న 152 ఎకరాల భూముల్లో డంపింగ్‌ యార్డ్ పెట్టాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించడంతో, రైతులలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

గుమ్మడిదలలోని అన్ని గ్రామాల్లో రైతులు మంచి కూరగాయలు పండిస్తుంటారు. ప్రతిరోజు ఈ మండలంలోని గ్రామాల నుండి సుమారుగా 20 టన్నుల కూరగాయలు బోయిన్పల్లి, కూకట్‌ పల్లి, షాపూర్ నగర్, మూసాపేట్ మార్కెట్ లకు వెళ్తుంటాయి. సుమారుగా 2 వేల లీటర్ల పాలు కూడా ఇక్కడి రైతులు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నారు.

డంపింగ్‌ యార్డ్ చేపట్టడం వలన తమ ప్రాంతంలో గాలి, నీరు కాలుష్యం అవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు. డంపింగ్‌ యార్డ్ ని ఎలాగైనా అడ్డుకుంటామని మండల కేంద్రంలో పె...