Telangana,medak, ఏప్రిల్ 13 -- తాను ఎందుకు వెళ్ళాడో.. ఏ కారణంతో వెళ్ళాడో తెలియదు. సుమారు 11 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులను వదిలి ఇంటి నుంచి పారిపోయాడు ఓ యువకుడు. మళ్లీ వారిని కలిసేందుకు కూడా రాలేదు. కనీసం తన ఫ్రెండ్స్, బంధువులతో కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆశలు సన్నగిల్లిన కుటుంబ సభ్యులు.. ఈనెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ మొదలు పెట్టిన పోలీసులు. వారం రోజుల్లోనే ఆ యువకుడిని గుర్తించారు. తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ కుమారుడు ఇంటికి చేరుకోవటంతో.. ఆ కుటుంబంలో ఎనలేని ఆనందాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే. పాపన్నపేట మండలం లో లక్ష్మీ నగర్ గ్రామానికి చెందిన కూనమనేని శ్రీనివాస్ రావు, శారద దంపతులకు తేజ సాయి, బిందు మాధవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు...