తెలంగాణ,మెదక్, ఫిబ్రవరి 23 -- విద్యాబుద్ధులు చెప్పాలిసిన టీచరే తప్పుగా ఆలోచించాడు. కీచకునిగా మారి. తన కూతుర్ల కంటే చిన్న వయసు ఉన్న తొమ్మిదవ తరగతి పిల్లలను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని ఖమ్మంపల్లి జిల్లా పరిషద్ హై స్కూల్ లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా జీవ శాస్త్ర ఉపాధ్యాయుడుగా కాసుల దేవయ్య(52) పని చేస్తున్నాడు. తరచుగా స్కూల్లో ఉన్న ల్యాబ్ లోకి తీసుకెళ్లడం.. అక్కడ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 9వ తరగతి విద్యార్థినులు హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ, తల్లిదండ్రులను సంప్రదించి.. సిద్ధిపేట మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి పిర్యాదు మేరకు విచారణ కోసం పాఠశాలకు వచ్చిన ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, షీటీ...