భారతదేశం, ఫిబ్రవరి 18 -- Medak Crime : అక్రమ సంబంధం మరొక ప్రాణం తీసుకుంది. అక్రమ సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్న, ఇలాంటి సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పటి వరకు సంబంధం కొనసాగించిన మహిళా తనను దూరం పెడుతుందన్న కోపంతో, ఒక వ్యక్తి తన ప్రియురాలని చంపి, శవాన్ని తగలబెట్టిన సంచలన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే మెదక్ పట్టణంలో ఫతేనగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఆమె భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తుంది. తమ ఇంటికి దగ్గరలో ఉన్న బత్తుల ఏసు(40) మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ఆ సంబంధం కొనసాగింది.

అయితే ఈ విషయం, కొడుకులకు తెలియటంతో మహిళను తీవ్రంగా హెచ్చరించారు. తన కొడుకులకు భయపడి, గత కొంత కాలంగా ఏసును దూరం పెడుతూ వచ్చింది. మహ...