భారతదేశం, ఫిబ్రవరి 13 -- Medak Crime : ఉమ్మడి మెదక్(Medak) జిల్లాలో ఒకేరోజు రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హత్య(Murder) చేసిన ఘటన మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని తొగుట గ్రామంలో జరిగింది. తొగుట గ్రామానికి చెందిన మంద ఆశయ్యకు ఇద్దరు భార్యలు సంగమణి (50), మంజుల ఉన్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆశయ్యకు ఉన్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రోజు మొదటి భార్య సంగమణి బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా, రెండో భార్య మంజులతో కలిసి ఆశయ్య మరొక శుభకార్యానికి వెళ్లారు. కాగా సంగమణి ఆదివారం సాయంత్రమే ఇంటికి వచ్చింది.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగమణిపై ఎవరో గుర్తు తెలియని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. కాగా శుభకార్యానికి వెళ్లిన ఆశయ్య, మంజుల ద...