భారతదేశం, ఫిబ్రవరి 21 -- Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి జెసిబి సహాయంతో తవ్వకాలు ప్రారంభించారు. అటుగా వెళ్లిన గ్రామానికి చెందిన రైతులు వారిని ప్రశ్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాక, వారిని చంపేస్తామంటూ బెదిరించడంతో రైతులు వెను వెంటనే మిగతా గ్రామస్తులకు సమాచారం అందించారు.

ఘటనe స్థలానికి చేరుకున్న గ్రామస్తులు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. వారి నుండి పసుపు, కుంకుమ, తాయత్తు లు తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల తవ్వకాల కోసం వచ్చినట్టు అనుమానించారు. నిందితులను పోలీసులకు అప్పగించారు. వీరు హైదరాబాద్ బోయినపల్లి చెందిన వారు ఒకరు, చాంద్రాయణ గుట్ట...