భారతదేశం, ఫిబ్రవరి 5 -- Medak Crime: కూలీ పనులు చేస్తూ వస్తున్న సంపాదన చాలక పోవడంతో చోరీల బాట పట్టిన ఇద్దరిని మెదక్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి చోరీ చేసిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కూలీ పనులతో వచ్చే సంపాదన చాలక పోవడంతో చోరీలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.

వారి స్నేహితుడు మహమ్మద్ హఫీజ్ నుండి యూనికార్న్ బైక్ నెంబర్ TG 35 2215 తీసుకొని ఇద్దరు హెల్మెట్లను పెట్టుకొని పలు ప్రదేశాలలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మెదక్, కామారెడ్డి జిల్లాలో నాలుగు చైన్ స్నాచింగ్ లు చేశారు. మరొక రెండో ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అడ్రస్ అడిగే నెపంతో మహిళాల దగ్గరకి వెళ్లి మెడలోని మంగళసూత్రాలు తెంపుకొని పారిపోయేవారు.

గత ఏడాది నవంబర్ 6 రోజు సాయంత్రం 5 గంటల సమయంలో హావేలీఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ము...