భారతదేశం, ఏప్రిల్ 12 -- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని దేవయ్యగూడెం తండాకు చెందిన రాజు.. అతిగా మద్యం సేవించాడు. తాగి గొడవ చేస్తూ.. తాను ఆత్మహత్య చేస్తుకుంటానని కుటుంబసభ్యులని బెదిరించడం మొదలుపెట్టాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. గ్రామస్తుల సహాయం కోరారు. గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా.. రాజు వినలేదు. దీంతో వారు డయల్ 100 కు కాల్ చేసి పోలీసుల సహాయం కోరారు.

ఇంతలో రాజు తన ఇంటిలోని ఒక గదిలోకి వెళ్లాడు. లోపటి నుండి తాళం వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత ప్రయత్నం చేసినా రాజు తలుపు తీయలేదు. ఇంతలో డ్యూటీలో ఉన్న పోలీసులు విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్ అక్కడి చేరుకున్నారు. పరిస్థితిని అర్ధం చేసుకొని బలవంతంగా ఆ రూమ్ తలుపులు తొలగించి లోనికి వెళ్లారు. అప్పటికే రాజు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కంపించారు.

వెంటనే రాజుని కిందికి దించిన కానిస...