భారతదేశం, ఏప్రిల్ 12 -- కలెక్టర్.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. పాలనాధికారిగా వ్యవహరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉంటుంది. దానిని నిర్వర్తిస్తూనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మెదక్ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా వంటి రంగాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్- నో ఎంట్రీ, లెస్‌ పేపర్‌- లెస్ ప్లాస్టిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతేనా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు నిర్వహిస్తూ.. మెదక్‌లో అనేక మార్పులకు నాంది పలికారు.

ఇటీవల, రాహుల్ రాజ్ ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఒక రైతులాగా ధాన్యాన్ని శుభ్రం చేయడంలో సహాయం చేశారు. అంతేకాకుండా, ధాన్యంలో తేమ శాతం 17 శాతం ఉండేలా, చూస...