భారతదేశం, ఫిబ్రవరి 25 -- Medak Accident: పుణ్యకోసం కుంభమేళాకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఇంజినీర్ గా పనిచేస్తున్న వెంకట్రామి రెడ్డి (45), తన భార్య విలాసిని (39), వారి డ్రైవర్ మల్లా రెడ్డి (36) వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

విలాసిని అక్క విశాల, వెంకట్రామి రెడ్డి మిత్రులు మోతిలాల్, జ్ఞానేశ్వర్ రెడ్డి కూడా ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆరుగురు కూడా, శనివారం రోజు కుంభమేళాలో పాల్గొనాలని సంగారెడ్డి నుండి వెంకట్రామి రెడ్డి కార్ లో బయలుదేరారు.

కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత, వారణాసి దగ్గరలోని మీర్జాపూర్ వద్ద, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి, టిప్పర్ ని ఢి కొట్టారు. ఈ ప్రమాదంలో, వారి కారు నుజ్జు నుజ్జు కాగా, మల్లా రెడ్డి అక్కడిక్కడే మృత...