భారతదేశం, జనవరి 26 -- దేశంలో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో శ్రమ దోపిడీ జరుగుతోందని.. సీపీఎం ఆగ్ర నాయకురాలు బృందాకారత్ ఆరోపించారు. బీజేపీ మద్దతుతో ఇది జరుగుతోందని వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో 12 నుంచి 13 గంటలు పని చేయిస్తున్నారని అన్నారు. దీన్ని ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వాలున్న తెలంగాణ, కర్ణాటకలో కూడా ఇలాగే జరగడం బాధాకరమన్నారు. ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టాలను సరిగా అమలు చేయాలని బృందాకారత్ సూచించారు. ఇండియా కూటమి ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సరైన దారి చూపాలని పిలుపునిచ్చారు.

సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం తెలంగాణ నాలుగో మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరైన బృందాకారత్.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారుల ఆస్తులు 400 రెట్లు ...