భారతదేశం, ఫిబ్రవరి 22 -- ముఖ్యమంత్రులు మారారే తప్ప.. తెలంగాణ పాలనలో ఎలాంటి మార్పు లేదని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వ్యాఖ్యానించారు.

కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో అవినీతి, అక్రమ ప్రభుత్వాలున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. చేతకాని విధానాల వల్ల కనీసం జీతాలివ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శలు గుప్పించారు. 6 గ్యారెంటీలు, సబ్ గ్యారెంటీల మాట దేవుడెరుగు.. కనీస హామీలను కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణను అప్పులకుప్పగా మార్చాయని....