భారతదేశం, ఏప్రిల్ 13 -- MBBS Exam Malpractice : ఎంబీబీఎస్ ప‌రీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ చోటు చేసుకుంది. విజ‌య‌వాడ సిద్ధార్థ గ‌వ‌ర్నమెంట్ మెడిక‌ల్ కాలేజీలో వారంలోనే రెండోసారి మాల్‌ప్రాక్టీస్ బ‌య‌ట‌ప‌డింది. దీంతో ప‌రీక్షల నిర్వహ‌ణ‌లో జ‌రిగిన లోపంపై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అలాగే డ‌బ్బులు కూడా చేతులు మారాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

విజ‌య‌వాడలోని సిద్ధార్థ గ‌వ‌ర్నమెంట్ మెడిక‌ల్ కాలేజీలో శ‌నివారం జ‌రిగిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం పార్ట్-1 క‌మ్యూనిటీ మెడిసిన్ ప‌రీక్షలో మాల్ ప్రాక్టీస్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు విద్యార్థులు ప‌ట్టుప‌డ్డారు. వారి హాల్ టిక్కెట్లు, గుర్తింపు కార్డులు, స‌మాధానాల ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం వాటిని మాల్ ప్రాక్టీస్ క‌మిటీకి పంపారు. వారు మాల్ ప్రాక్టీస్ క‌మిటీ ముందు విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.

స‌ర...