Hyderabad, ఏప్రిల్ 14 -- Mazaka TV Premiere Date: జీ తెలుగు ఛానెల్లోకి వచ్చేస్తోంది సందీప్ కిషన్ రొమాంటిక్ కామెడీ మూవీ మజాకా. థియేటర్లలో రిలీజైన రెండు నెలల్లోనే ఈ సినిమా టీవీ ప్రీమియర్ కానుండటం విశేషం. ఈ మూవీ వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీని సోమవారం (ఏప్రిల్ 14) తన ఎక్స్ అకౌంట్ ద్వారా జీ తెలుగు వెల్లడించింది.

సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షులాంటి వాళ్లు నటించిన మూవీ మజాకా. ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరు సక్సెస్ సాధించింది. తర్వాత మార్చి 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక ఇప్పుడు టీవీలోకి కూడా వచ్చేస్తోంది.

వచ్చే ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. "ఈ అల్టిమేట్ ఎంటర్టైనర్ చూసి తెగ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మజాకా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల...