Hyderabad, ఫిబ్రవరి 24 -- Sundeep Kishan Mazaka Trailer Review: హీరో సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. సందీప్ కిషన్ సినీ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాకు ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు.

ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ మజాకా మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఫిబ్రవరి 23న మజాకా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

మజాకా ట్రైలర్ ఆద్యంతం కామెడీతో అదిరిపోయింది. మజాకా ట్రైలర్‌ రివ్యూలోకి వెళితే.. రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రీ కొడుకులు. ఎటువంటి కట్టుబాట్లు, బాధ్యతలు లేకుండా జీవితాన్ని బ్యాచిలర్స్‌లా హాయిగా గడుపుతుంటారు. స...