భారతదేశం, ఫిబ్రవరి 26 -- Mazaka Review సందీప్‌కిష‌న్, రీతూ వ‌ర్మ హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌జాకా మూవీ శివ‌రాత్రి సంద‌ర్భంగా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో రావుర‌మేష్‌, అన్షు (మ‌న్మ‌థుడు ఫేమ్‌) కీల‌క పాత్ర‌లు పోషించారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌జాకా ఏ మేర‌కు ఆడియెన్స్‌ను న‌వ్వించింది? సందీప్‌కిష‌న్‌కు హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

వెంక‌ట‌ర‌మ‌ణ (రావుర‌మేష్‌) భార్య చ‌నిపోతుంది. మ‌రో పెళ్లి చేసుకోకుండా కొడుకు కృష్ణ‌ను(సందీప్‌కిష‌న్‌) పెంచి పెద్ద చేస్తాడు. కృష్ణ‌కు గ్రాండ్‌గా పెళ్లి జ‌రిపించి ఫ్యామిలీ ఫొటోను ఇంట్లో పెట్టుకోవాల‌న్న‌ది వెంక‌ట ర‌మ‌ణ క‌ల‌. కానీ కృష్ణ‌కు ఒక్క పెళ్లి సంబంధం సెట్ కాదు. ఆడ‌దిక్కు లేకుండా ఇద్ద‌రు మ‌గాళ్లు ఉన్న ఇంట్లోకి అమ్మాయిని పంపించేది లేదం...