Hyderabad, ఫిబ్రవరి 4 -- Max OTT Release Date: కన్నడ మూవీస్ ఈ మధ్య ఓటీటీ కంటే ముందే శాటిలైట్ డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ కంటే ముందే టీవీ ప్రీమియర్ గురించి ప్రోమోలు రిలీజ్ చేయడం విశేషం. ఈ మధ్యే యూఐ మూవీ ఇలా చేయగా.. ఇప్పుడు కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ కూడా అదే రూట్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. గతేడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైనే వసూలు చేసింది.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ ఇస్తూ.. టీవీ ప్రీమియర్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయడం విశేషం. జీ నెట్‌వర్క్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల...