భారతదేశం, ఫిబ్రవరి 3 -- Mastan Sai : హీరో రాజ్ తరుణ్ -లావణ్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి మస్తాన్ సాయి కారణమని లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పలువురి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల విచారణలో...మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్య ఈ హార్డ్ డిస్క్ ను పోలీసులకు అప్పగించింది. ఇందులో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు ఆమె ఆరోపిస్తుంది.

మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో సన్నిహితంగా ఉండగా, వారి ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య ఆరోపించారు. ఆ వీడియోలతో సాయి వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసేవాడని చెప్పింది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన పలు వీడియోలను లావణ్య పోలీసులకు అందించింది. సాయి గతంలో డ్రగ్స్ కేసులో అరెస్...