భారతదేశం, ఏప్రిల్ 14 -- మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దమవుతోంది. 'మాస్ జాతర' టైటిల్ తో రెడీ అవుతున్న ఈ ఫిల్మ్ సందడి మొదలైంది. ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ నేడు (ఏప్రిల్ 14) రిలీజైంది. 'తూ మేరా లవర్' అంటూ సాగుతున్న ఈ సాంగ్ లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చనిపోయిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ చక్రి గొంతును ఏఐ సాయంతో రీక్రియేట్ చేసి ఈ పాట పాడించారు.

రవితేజకు దివంగత చక్రి ఎన్నో ఛార్ట్ బస్టర్స్ అందించారు. హిట్ సాంగ్స్ ఇచ్చారు. అలాంటి చక్రికి ట్రిబ్యూట్ గా మాస్ జాతర టీమ్ ఈ స్పెషల్ సాంగ్ ను రెడీ చేసింది. ఏఐ సాయంతో చక్రి గొంతుతో 'తూ మేరా లవర్' సాంగ్ ను సిద్ధం చేసింది. ఆయన గొంతులో మళ్లీ పాట వినడం ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. చక్రికి రవితేజ అండ్ టీమ్ గొప్ప ట్రిబ్యూట్ ఇచ్చిందనే కామెంట్లు వస్తున్నాయి.

రవిత...