Hyderabad, జనవరి 26 -- Mass Jathara Glimpse Released On Ravi Teja Birthday: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన మాస్ జాతర ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మాస్ జాతర గ్లింప్స్ విడుదల అయింది. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'మాస్ జాతర' గ్లింప్స్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉంది.

తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ, ఎనర్జీకి పెట్టింది ప...